విద్యతోనే అభివృద్ధి సాధ్యం..

Jan 24,2025 22:27
ఫొటో : మెమోంటోలు అందజేస్తున్న సిఐ గంగాధర్‌

ఫొటో : మెమోంటోలు అందజేస్తున్న సిఐ గంగాధర్‌
విద్యతోనే అభివృద్ధి సాధ్యం..
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మనిషి మనుగడ సాధించి అభివృద్ధి చెందాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని ఆత్మకూరు సిఐ గంగాధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని బిఎస్‌ఆర్‌, జూనియర్‌ కళాశాల, రెయిన్బో పాఠశాలలో అపస్మా ఆధ్వర్యంలో 78మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఈ పరీక్షలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, మెమోంటో, సర్టిఫికెట్‌, మెడల్‌ బహూకరించారు. కార్యక్రమంలో ఎంఎంటిఎస్‌ఇ కన్వీనర్‌ రమణ రెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, జిల్లా సెక్రెటరీ రామ్మోహన్‌ రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రెసిడెంట్‌ కోటేశ్వర్‌ రెడ్డి, సెక్రటరీ మల్లికార్జున్‌ నాయుడు, ట్రెజరర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఇతర అపస్మా స్కూల్‌ కరస్పాండెంట్‌, మిత్రులు పాల్గొన్నారు.

➡️