ప్రజాశక్తి-విజయనగరం కోట : మండలంలోని రాకోడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2300/- మద్దతు ధర ఉందన్నారు. ఉచిత గోనె సంచులు, లేబర్ ఛార్జీలు, రవాణా ఛార్జీల భారం ప్రభుత్వం భరిస్తుందన్నారు. రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 48 గంటల్లోనే ధాన్యం సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారని తెలిపారు. రైతులు ధలారుల చేతిలో మోసపోకుండా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాకోడు, జొన్నవలస ఎంపిటిసిలు వేచలపు శ్రీనివాసరావు, రాజేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.