ప్రజాశక్తి-మాధవధార : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ నెల 30వ తేదీన చేపట్టే మహాధర్నాకు సంబంధించి 49, 50, 51 వార్డుల్లో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్.శ్రావణ్‌కుమార మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం రూ.28,728 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 30వ తేదీ తర్వాత మున్సిపల్ కార్మికులందరూ మరో సమ్మె చేయడం తద్యమని హెచ్చరించారు. 30వ తేదీ ధర్నాలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంగారయ్య, ధనలక్ష్మి, రమణ, శంకర, శివ, భద్ర, దేవి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.