16న దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ

Feb 13,2024 16:16 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంట నష్టం, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజు వేతనం 600 చెల్లించాలని, ట్రాన్స్ పోర్ట్ కార్మికుల మెడపై పెట్టిన కత్తి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంద్, ట్రాన్స్ పోర్ట్ సమ్మె, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టీయూసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగుల ఈశ్వరరావు, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ళ పద్మ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు గడిగట్ల సత్తిబాబు, కరణం విశ్వనాథం, కాటంరాజు, టి.రాజా, దివిలి నాగు తదితరులు పాల్గొన్నారు.

➡️