”తిరుపతి కోసం పరుగు” గోడపత్రిక ఆవిష్కరణ

ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో శాప్‌, ఈగల్‌ (ఎలైట్‌ యాంటీనార్కటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్ఫోర్స్మెంట్‌), నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌) సహ భాగస్వామ్యంతో ”వీ వైబ్‌” సంస్థ నిర్వహించే ”తిరుపతి కోసం పరుగు ( వీ రన్‌ ఫర్‌ తిరుపతి) కార్యక్రమ గోడ పత్రికను బుధవారం వర్సిటీ వీసీ చాంబర్లో వర్సిటీ ఉపకులపతి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య మాదాల భూపతి నాయుడు ఆవిష్కరించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 30 నిమిషాలు నడక గాని, పరుగు కానీ దైనందిన జీవితంలో భాగంగా ఉండాలని వారు అన్నారు. తిరుపతి వాసులు డిసెంబర్‌ 8 తారీఖున జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి కోరారు. 10 కే మాత్రమే మొదటి మూడు విజేతలకు దాదాపు 60 వేల ప్రైజ్‌ మనీ కూడా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవీణ, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పాకనాటి హరికృష్ణ, పరీక్షలు విభాగా డీన్‌ ఆచార్య కిషోర్‌, ఆచార్య చంద్రశేఖరయ్య, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

➡️