సూళ్లూరుపేటలో ఎడతెరిపిలేకుండా వర్షం…

Nov 30,2024 17:55 #in Sullurpet, #incessant rain

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా సూళ్లూరుపేట పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణముగా బజారు వీధులు, లోతట్టు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే జలమయంగా మారుతున్నాయి. ఇలాగే వర్ష సాయంత్రం వరకు కురిస్తే లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో కొన్ని చోట్ల చెట్లు ఊగి విద్యుత్‌ వైర్ల మీద పడే ప్రమాదం కనిపిస్తుంది. పలు చోట్ల హోర్డింగులు కూడా గాలికి పడుతున్నాయి. ఈ భారీ వర్షం రేపటి దాకా కురుస్తుందని వాతావరణ శాఖా సూచిస్తుంది. ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

➡️