టిడిపిలో చేరికలు

Feb 6,2025 00:01 #Anandapuram Joinings in TDP
Joinings in TDP

 ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం సీనియర్‌ నాయకులు కాకర్లపూడి వరహాల రాజు, శ్రీకాంత్‌ రాజు కుటుంబ సభ్యులు, స్థానిక ఎంపిటిసి, గ్రామ ప్రజలు సుమారు వంద కుటుంబాలు గురువారం కాకర్లపూడి నివాసంలో ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాకర్లపూడి శ్రీకాంత్‌ మాట్లాడుతూ, భీమిలి నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించాన న్యాయం చేస్తానన్నారు. వైసిపి నుంచి తెలుగుదేశంలో చేరిన వారిలో శొంఠ్యాం కో-ఆపరేటివ్‌ సొసైటీ మాజీ అధ్యక్షులు కాకర్లపూడి వరహాల రాజు, శ్రీకాంత్‌రాజు, మాజీ సర్పంచ్‌ కాకర్లపూడి సీతారామరాజు, కనమాం ఎంపిటిసి సభ్యులు గొలగాని కృష్ణ, మాజీ సర్పంచ్‌ మదపాటి సత్తిబాబు, సరగడం వెంకట అప్పారావు, ఎర్ర అప్పారావు, లంక సోమనాయుడు, గంగిరెడ్ల వీరన్న, లంక బంగారునాయుడు , అచ్చిరెడ్డి దేవుడుబాబు, గుర్ల రమణ, అక్కిరెడ్డి పెంటయ్య తదితరులు ఉన్నారు. వీరందరికీ టిడిపి కండువాను కప్పి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి కల్చర్‌ అసోసియేషన్‌ అధినేత ఘట్టమనేని సుభాష్‌ చంద్రబోస్‌, తాట్రాజు అప్పారావు, సర్పంచులు బిఆర్‌బి.నాయుడు, ఆబోతు అప్పలరాము, సోంబాబు, రమేష్‌బాబు, మీసాల సత్యనారాయణ, బంటుబిల్లి అప్పలస్వామి, జోగ ముత్యాలు, చందవరపు కుమార్‌, పాల్గొన్నారు.

➡️