ప్రజాశక్తి-పీలేరు ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లోని అపోహలను దూరం చేసి, అభిమానాన్ని, నమ్మకాన్ని పెంపొందించాలని రాయచోటి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటశివ తెలిపారు. పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ఆసుపత్రిలో సేవలను ఏడు విభాగాలుగా చేసి, వాటిలో విధులు నిర్వహించే వారి పనితీరును గుర్తించేందుకు మంగళవారం పోటీ నిర్వహించారు. ఇందుకోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి మత్తు విభాగం వైద్యులు డాక్టర్ వెంకట శివ, మహల్ కమ్యూనిటీ హెల్ప్ సెంటర్ హెడ్ నర్స్ బీబీ ఫరీష్ పర్యటించి నివేదికలను తయారు చేశారు. వారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ?ంగా తనిఖీ చేసి, అలాగే రోగులతోనూ మాట్లాడి మార్కులు ఇచ్చారు. ఈ మార్కుల ఆధారంగా సిబ్బంది పనితీరుకు గ్రేడింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇది కేవలం ఆసుపత్రి సిబ్బందిలో పోటీ తత్వాన్ని, సూార్తిేని నింపేదుకు మాత్రమేనని, ఇందులో ఎవరూ భేషజాలకు పోకుండా భవిష్యత్తులో సేవలందించడంలో ఆసుపత్రి గుర్తింపును విస్తతపరచడానికి మరింత కషి చేసేలా నైపుణ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వెంకటశివ ప్రథమ, ద్వితీయ స్థాయి బహుమతులను, మిగిలిన వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రధానం చేశారు. ప్రథమ బహుమతిని ప్రసూతి విభాగానికి ప్రాతినిధ్యం వహించిన హెడ్ నర్స్ అమ్మాజీ, స్టాఫ్ నర్సులు లావణ్య, జ్యోతి, రేష్మ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు బాదుల్లా, సరిత, పారిశుధ్య సిబ్బంది ఎర్రమ్మ, అమత బందానికి అందజేశారు. ద్వితీయ బహుమతిని రోగ నిర్ధారణ విభాగము (లేబరేటరీ, ఎక్స్ రే విభాగము) గెలుచుకుంది. ఈ విభాగానికి ప్రాతినిధ్యం వహించిన హెడ్ నర్స్ పుష్పలత, ల్యాబ్ టెక్నీషియన్ మల్లికార్జున, రేడియోగ్రాఫర్ శ్రీనివాసులు, జిడిఎ స్వామినాథన్, పారిశుద్ధ్య కార్మికులు నాగరాణి, నసీబ్ జాన్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిఎస్‌ఆర్‌ఎంఒ డాక్టర్ సరస్వతమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ షరీఫ్ జాన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భాస్కర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శివ, హెడ్ నర్సులు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
