ప్రజాశక్తి – పుట్లూరు : మండలంలోని అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో అలివేలమ్మ టి ఏ లకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో అలివేలమ్మ మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో ఉపాధి పనులు కల్పించాలని అదేవిధంగా ఆర్టికల్చర్ పెంచాలని, మినీ గోకులాలను త్వరగా పూర్తి చేయించాలని టీఏలకు ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో చిన్న కేశవులు టి ఏ లు బీఎఫ్టీలు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.