పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలి : సిపిఎం డిమాండ్‌

శంకరాపురం (ప్రకాశం) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మంగళవారం నుంచి గ్యాస్‌ బండపై ఒక్కసారిగా 50 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమని పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెల్లంపల్లి ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్యాస్‌ రేట్లు తగ్గించాలని కోరుతూ … శంకరాపురం ముండ్లమూరులలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ … బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీ అదానీలకు ప్రభుత్వ రంగ పరిశ్రమని ధరాదత్తం చేస్తూ వారిని కుబేరులుగా చేస్తూ ప్రజల పైన భారాలు మోపుతున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్‌ ఆయిల్‌ ద్వారా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇక్కడ గ్యాస్‌ పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు ఏమాత్రం తగ్గించక పెంచుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సుంకాల పేరుతో తన ఖాతాలో ప్రజల డబ్బును వేసుకొని ప్రజలకు ఊరట లేకుండా చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న గోదావరి బేసిన్‌ లో సహజ వాయువు నిక్షేపాలను అంబానికి బిజెపి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. వేల కోట్లరూపాయలు వ్యాపారం చేసుకుని అంబానీ కోటీశ్వరుడు అవుతున్నారని, ప్రజలు మాత్రం అధిక ధరలతో కఅంగిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి హనుమంతరావు జి సత్యం రమేష్‌ ఎర్రయ్య హనుమయ్య వెంకటయ్య నరసింహారావు శ్రీను కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️