అనకాపల్లి : జిల్లాలోని రియల్ ఎస్టేట్ దందా రోజు రోజుకి పెరుగుతుంది. కిరాయి మనుషులను పేదలపై ఉసుగొలిపి కొత్త సంస్కఅతి పెరుగుతుంది. సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం పెరుగుతుంది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ లో జరుగుతున్న ప్రజావాణీలో నూటికి 90 శాతం పేదలు సమస్యలు పరిష్కారం కావడం లేదని వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి.వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల అనంతరం మాట్లాడారు. రావికమతం, మండల కోట్నాబిల్లి గ్రామానికి చెందిన గొరాపెద్దిరాజు ఆదివాసీ గిరిజనుడకు సర్వే నెంబర్ 144/1లో రెవెన్యూ అధికారులు పూర్వం పట్టా ఇచ్చారని తెలిపారు. దీన్ని అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. దీనిపై నర్సిపట్నంకు చెందిన అధికారి గోపాల్ రావు కుటుంబ సభ్యులు కన్ను ఈ భూమిపై పడిందని తెలిపారు. దీంతో ఈ భూమి నాదంటు గత కొంత కాలంగా గొరా పెద్దిరాజును వేధిస్తు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. గురువారం రెండు పోలీసులు స్టేషన్లు కు చెందిన పోలీసులు రెవెన్యూ అధికారులు నర్సిపట్నంకు చెందిన 50 కిరాయి మనుషులను అధికారి గోపాల్ రావు కుటుంబీకులు తీసుకు వచ్చి గొరాపెద్దిరాజును బలవంతంగా భూమి నుండి గెంటెశారని తెలిపారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. వెంటనే గొరాపెద్దిరాజుకు ఇచ్చిన పట్టా భూమిని చూపించి బలవంతంగా కిరాయి మనుషులతో తొలగించిన అధికారులు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఇలాంటి సంఘటనలు అనేకమైనవి జరుగుతున్నాయని తెలిపారు. మంగళవారం దేవరాపల్లి మండలంలోని ఎ కొత్తపల్లి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి మనుషులతో దాడి చేశారని తెలిపారు భూస్వాములు ధనవంతలు అక్రమించుకుంటే అధికారులు నోరు మెదపడం లేదన్నారు. గర్సింగి పంచాయతీ ప్రభుత్వ భూమిలో బరువేసెసి గెడ్డలు కప్పేసిన పట్టించుకోలేెదన్నారు. దేవరాపల్లి కాయగూరలు మార్కెట్ నుండి రైవాడ లింక్ కెనాల్ వరకు కోట్లు విలువ చేసె ఇరిగేషన్ భూములు అమ్మేషిన పట్టించుకోలేదన్నారు. కె కోటపాడు మండలం కింతలి ఆర్లేలో ప్రభుత్వ అక్రమింప చేసిన పట్టించుకోలేదన్నారు. బుచ్యయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 110 ఎకరాలు ప్రభుత్వ భూములు అక్రమించేసిన పట్టించుకో లేదన్నారు. వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీలో వందల ఎకరాలు భూములు అక్రమింపచేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయాన ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ లో జరుగుతున్న ప్రజావాణీ లో నూటికి 90 శాతం సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సివిల్ కేసులో పోలీసులు జోక్యం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 9/77 అసైన్డ్ చట్టాన్ని రక్షించవలసి అధికారులే భూస్వాములు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కిరాయి మనుషులను వాడుకుంటున్న కొత్త సంస్కఅతికి తెరతీశారని ఇది చాల ప్రమాదమన్నారు. ఇదే పరిస్థితి జిల్లా కొనసాగితే పూర్తిగా పేదల భూములు ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. రావికమతం మండలం కోట్నాబిల్లి లో ఆదవాసి గిరిజనులు లాంటి పేదలు జిల్లా లో అనేక మందిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా పెరిగిపోతుందని వెంటనే భూఆక్రమణ ను రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాను అరికట్టాలని సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం తగ్గించాలని పేదల భూములకు రక్షణ కల్పించాలని వెంకన్న డిమాండ్ చేశారు.
