ఇండియా వేదిక అభ్యర్థుల గెలుపు అవసరం

Apr 23,2024 21:47

ప్రజాశక్తి-మాచర్ల : మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ప్రారంభమయ్యాయని, దాన్ని కాపాడుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమారు అన్నారు. మంగళవారం మాచర్ల పట్టణంలో ఇండియా బ్లాక్‌ బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ యరమల రామచంద్రారెడ్డి విజయం కోసం ర్యాలీ నిర్వహించారు. విజరు కుమార్‌ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు బిజెపి చేసిన వాగ్దానాలను విస్మరించి ందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజాధ నాన్ని వారికి దోచిపెట్టేలా విధానాలు ఉన్నాయని అన్నారు. నల్లధనం బయటకు తెస్తానని వాగ్దానం చేసిన వారు కార్పొరే ట్లకు రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని వారికి దోచిపెట్టిరని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, మరి కొన్ని పార్టీలు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మోడీ వ్యతిరేక పోరాటం చేస్తూన్నాయని చెప్పారు. బిజెపిని, ఆ పార్టీకి మద్దతిచ్చేవారిని ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. మాచర్లలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రా రెడ్డికి ఓటేయాలన్నారు. ర్యాలీలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆంజనేయులు నాయక్‌, ఎంసిపిఐ నాయకులు అబ్రహం లింకన్‌, స్థానిక నాయకులు బండ్ల మహేష్‌, సురేష్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️