భారతదేశ న్యాయ వ్యవస్థ ఎంతోధృడమైనది

ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్‌ భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో దఢమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్టి పేర్కొన్నారు. శనివారం మదనపల్లిలోని కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన అడిషనల్‌ సివిల్‌జడ్జి (సీనియర్‌ డివిజన్‌)కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని మదనపల్లె బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ దేశచరిత్రలో మదనపల్లి పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జాతీయ గీతం జనగణమనను ప్రసిద్ధిగాంచిన బి.టి.కళాశాలలో బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేశారని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం 470 ఆర్టికల్స్‌, 106 రాజ్యాంగ సవరణ చట్టాలు కలిగి ఉందన్నారు. వీటికి న్యాయవ్యవస్థతో సంబంధం ఉందనారు. ముఖ్యంగా ఆర్టికల్‌ 14 దేశ పౌరుల సమానత్వాన్ని తెలియజేస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు సర్వోన్నతమైందన్నారు. దేశ న్యాయవ్యవస్థకు సంబంధించి సర్వహక్కులు సుప్రీం కోర్టుకు ఉంటాయన్నారు. దేశంలోని హైకోర్టులు, జిల్లా కోర్టులు సుప్రీం కోర్టు ఆదేశానుసారం పనిచేస్తాయని అన్నారు. న్యాయవ్యవస్థపై దేశ ప్రజలకు మరింత నమ్మకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది జరగాలంటే కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో ఎంతోమంది ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని పెంపొందించారని తెలిపారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు పనిచేయడం దేశ న్యాయవ్యవస్థకు గర్వకారణమని అన్నారు. భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ పరస్పర సహకారంతో దేశప్రతిష్ట పెంచుతున్నాయని కితాబిచ్చారు. ముఖ్యంగా మదనపల్లెలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, విద్యాభ్యాసం, కళాశాల, లాయర్‌గా ప్రాక్టీస్‌, తన గురువులు అందించిన ప్రోత్సాహాన్ని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ సరసా వెంకటనారాయణ భట్టి గుర్తు చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ మదనపల్లెకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఈ ప్రాంతానికి రావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మదనపల్లి కోర్టు సముదాయంలో ఉన్న మేజిస్ట్రేట్‌ కోస భవనం పూర్వం ఎంతో నైపుణ్యంగా రాతి కట్టడంతో కట్టారని, ఆ భవనాన్ని యథా స్థితిలో ఉంచి, భవనం పైనే మరో కొత్త భవనం ఏర్పాటు చేసి ఇస్తామని తెలిపారు. ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయంగా తమకు స్వాగతం పలికారని, కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇక్కడే జనగణమన ఆలపించడం, జిడ్డుకష్ణమూర్తి ఈ ప్రాంతవాసి కావడం, బిటి కళాశాల ఉండడం, ఇంత ఘన చరిత్ర ఉన్న మదనపల్లెలో కోర్టు భవనం ప్రారంభించడం జ్ఞాపకంగా ఉంటు ందన్నారు. ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లెకు న్యాయపరమైన ఎలాంటి అవసరాలు కచిచ్చితంగా పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ బి.కష్ణమోహన్‌, జస్టిస్‌ టిసిడి శేఖర్‌ , బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తొట్లి వెంకటర మణారెడ్డి, చిత్తూరు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్‌ జడ్జి భీమారావు, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జి జస్టిస్‌ అబ్రహామ్‌, ఇతర కోర్టుల న్యాయమూర్తులు వెంకటేశ్వర్‌ నాయక్‌, సిరీష్‌, విజయకుమార్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, అడిషినల్‌ ఎస్‌పి వెంకటాద్రి, తహశీల్దార్‌ ధనుంజయులు, సిఐలు సత్యనారాయణ, కళా వెంకటరమణ, ఎరిషా వల్లి, రామచంద్ర, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

➡️