మాట్లాడుతున్న ప్రిన్సిపల్ రవికుమార్
‘టిఆర్‌ఆర్’లో ఇండక్షన్ ప్రొగ్రామ్
ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ నూతనంగా చేరిన విద్యార్థులకు డిగ్రీ కళాశాలకు పరిచయం చేసే ఇండక్షన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఇంటర్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు డిగ్రీ విద్యను, కళాశాల విద్య యొక్క ప్రాధాన్యతను, ఇక ఇకనుంచి విద్యార్థినీ విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో తెలియజేసే ఇండక్షన్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ ప్రారంభించారు. రవి కుమార్ ఈ విద్యా సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ తమ కళాశాలలో ఉన్న అనేక సదుపాయాల గురించి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండల నరేంద్ర, ఇండక్షన్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ కే కరుణకుమార్, డాక్టర్ కె సుజాత ఉన్నారు.
