బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

Jun 10,2024 20:48
బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

మాట్లాడుతున్న డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ
బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి
ప్రజాశక్తి-కోవూరు:గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సలహాలు, సూచనలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా అడిషనల్‌ డిఎంఅండ్‌హెచఒ డాక్టర్‌ ఖాదర్‌వలి తెలిపారు. మండలంలోని ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం పీఎంఎస్‌ఎంఏ కార్యక్రమంలో భాగంగా జరుగుతోన్న కార్యక్రమాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వారికి పండ్లు, చిక్కీలు, ప్రొటీన్‌ పౌడర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు తప్పనిసరిగా ఆకుకూరలు, పాలు, పండ్లు, ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం కూడా ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పోష్టికాహారం సక్రమంగా తీసుకోకపోతే కాన్పు సమయంలో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఇర్ఫాన్‌, సిహెల్‌ట్వా నరసమ్మ, పిహెచ్‌ఎన్‌ కృష్ణమ్మ, హెల్త్‌ సూపర్‌వైజర్లు ఎస్‌కె ఇలియాజ్‌, ఉమామహేశ్వరి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️