ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.కే. మాధవీలత శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. అత్యంత ప్రశాంతంగా ”ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని నిర్వహించాలని వివిధ శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎన్. తేజభరత్, డిఆర్‌ఓజి.నరసింహులు వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
