ఒంగోలు (ప్రకాశం) : కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలని విరమించుకోవాలని, సెయిల్ లో విలీనం చేయాలని కోరుతూ … విద్యార్థి యువజన రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహించడం జరిగింది.