31వ రోజుకు చేరిన న్యాయవాదుల దీక్షలు

ప్రజాశక్తి – కడప : జిఒ నంబర్‌ 145 ను రద్దు చేసేంతవరకు తమ ఉద్యమం ఆగదని కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప నాయుడు, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రెటరీ నంద్యాల చిన్నయ్య, న్యాయవాదులు హెచ్చరించారు. జీవో నంబరు 145 ను వెంటనే ఉపసంహరించుకోవాలని, తద్వారా ప్రజలకు మేలు చేయాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా కోర్టు ఎదుట తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ … కడప బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారంతో 31 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో కే.రామకొండయ్య, నంద్యాల చిన్నయ్య, మదన్మోహన్‌ రెడ్డి, భువన ఏకాదశి రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, పటాన్‌ సాదక్‌ అలీ ఖాన్‌, జి.శ్రీనివాసులు రెడ్డి, జీ.వి. శ్రీనివాసులు, ఆమంచి అరవిందు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జూనియర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️