అంగన్వాడీల వినూత్న నిరసన

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం అంబేద్కర్‌ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వినూత్నరీతిలో సోమవారం నిరసన ప్రదర్శించారు. కళ్లకు గంతలు కట్టుకుని ”రెడ్‌ బుక్‌ పరిపాలన నశించాలి.. అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి” అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం రెడ్బుక్‌ ప్రయోగించడం దారుణమని సీఐటీయూ నాయకుడు త్రిమూర్తులు అన్నారు.

➡️