అట్రాసిటీ కేసుపై విచారణ

Mar 20,2025 21:29

ప్రజాశక్తి-వేపాడ : వల్లంపూడి ఎస్‌ఐ దేవిపై మండలంలోని గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ పెట్టిన అట్రాసిటీ కేసుపై డిఎస్‌పి వీరకుమార్‌ గురువారం విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లారు. అక్కడ ఫిర్యాదుదారు లేకపోవడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆరోజు గ్రామంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కొంతమంది వ్యక్తులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. అటువంటి వారి మాటలు విని అమాయకులు మోసపోవద్దని కోరారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. దర్యాప్తులో ఎస్‌.కోట రూరల్‌ సిఐ అప్పలనాయుడు పాల్గొన్నారు.

➡️