వైద్యశాల ఏర్పాటుకు స్థల పరిశీలన

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : మండల పరిధిలోని డిజిపేట గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణాని ఎమ్మెల్యే డాక్టరు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం స్థలాన్ని పరిశీలించారు. డిజి పేట గ్రామంలోని నేషనల్‌ హైవే 167/బి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి గురించి ఆరా తీశారు. స్థల సేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించే నిమిత్తం ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల ధ్యక్షులు డాక్టర్‌ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి గోదాసు జయరాములు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు బోయళ్ల నారాయణరెడ్డి, టిడిపి నాయకులు ఎన్‌సి.మాలకొండయ్య, ఏ.రామకష్ణంరాజు, బత్తుల వెంకటాద్రి, మండల తెలుగు యువత అధ్యక్షుడు బత్తుల రమణయ్య, పావలి తిరుపతయ్య, చెరుకుపల్లి వెంకటరెడ్డి, చావా శేఖర్‌, కొవ్వారపు యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️