అమరావతి, అచ్చంపేట ఇసుక క్వారీలు తనిఖీ

Feb 13,2024 15:00 #palanadu

ప్రజాశక్తి-పల్నాడు : పల్నాడు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్‌లను కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి మంగళవారం పరిశీలించారు. ఇసుక అక్రమ తవ్వకాల చేపట్టకుండా మండల స్థాయి పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యావరణ అనుమతులు ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలని, ఇందుకోసం సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని సూచించారు. ఇసుక తవ్వకాలు సంబంధించి ఆర్‌.డి.ఓ, తహశీల్దార్‌, గ్రామ రెవిన్యూ అధికారి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో భూగర్భ జల వనరుల శాఖ అధికారిని నాగిని, ఏ.ఈలు, తహశీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

➡️