అభివృద్ధి పనులు పరిశీలన

Jun 11,2024 23:46 #Development works, #jiyyani
Development works Jiyyani

ప్రజాశక్తి-కరాస : జివిఎంసి 52వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్‌ జియ్యని శ్రీధర్‌ మంగళవారం పరిశీలించారు. జాతీయ రహదారిలోని సంజీవయ్యనగర్‌ గ్రీన్‌ బెల్ట్‌ పనులను, జిందాల్‌ భవన్‌ నుంచి మర్రిపాలెం ఉడా లే అవుట్‌ వరకు ఉన్న రోడ్డు డివైడర్‌ ఇరువైపులా జరుగుతున్న ఐరన్‌ గ్రిల్‌ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు డివైడర్‌ ఆధునీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వార్డులో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. కార్యక్రమంలో వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ, సచివాలయ సెక్రటరీ అనూప్‌ పాల్గొన్నారు.

➡️