ఉపాధి పనులు పరిశీలన

ప్రజాశక్తి-మద్దిపాడు : ఉపాధి పనుల్లో మేట్ల విధానాన్ని కొనసాగించాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం కోరారు. మండల పరిధిలోని నాగన్నపాలెంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించాలన్నారు. రోజు వారీ కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పే స్లిప్పులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఉబ్బా వెంకటేశ్వర్లు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

➡️