ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : అవినీతి ఆరోపణలపై భట్టిప్రోలు గ్రామపంచాయతీ కార్యాలయ రికార్డులను తనిఖీ చేస్తున్న అధికారులు. గత ఐదు ఆరు నెలల క్రితం రికార్డులను స్వాధీన పరుచుకున్న అధికారులు ఇప్పటికే పలుమార్లు పరిశీలన జరిపారు. గత నెలలో ఉన్నతాధికారులు ఐదు సంవత్సరాలకు గాను మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలన జరిపారు. మిగిలిన రెండేళ్ల రికార్డులు బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సీఈవో జ్యోతి బస్సు ఆధ్వర్యంలో సుమారు 8 మంది అధికారులు పాల్గని ఈ రికార్డులను తనిఖీ చేశారు. తనిఖీలు వెలుగు చూసిన అంశాలను పంచాయతీరాజ్ కమిషనర్ కు అందజేసి అవినీతి జరిగినట్లుగా నిరూపణ అయితే అట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఈవో తెలిపారు.