పంచాయతీ రికార్డులు పరిశీలన

ప్రజాశక్తి- భట్టిప్రోలు భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో అవినీతి, అక్రమాలు జరిగాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుత పాలకవర్గం, గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు దుర్వినియోగమైనట్లు సాయిబాబా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఉన్నతాధికారులు ఐదు నెలల క్రితం పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకొని ఇఒపిఆర్‌డి గదిలో భద్రపరి గదికి సీల్‌ వేశారు. అధికారులను ఐదు బందాలుగా మూడు విడతలుగా రికార్డులను పరిశీలించారు. గత డిసెంబర్‌లో ఉన్నతాధికారులు మరోమారు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా మిగిలిన రెండు సంవత్సరాల రికార్డులను బుధవారం పరిశీలించారు. నివేదికలను పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు ుందని ఉమ్మడి గుంటూరు జిల్లా జిల్లా పరిషత్‌ సిఇఒ జ్యోతి బసు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఒలు కె.మంగపూర్ణనాధ్‌, వెంకట ప్రసాద్‌, రాఘవయ్య, గుంటూరు డిపిఒ శ్రీనివాసరావు, ఎఒ ప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌కుమార్‌, రేపల్లె డిఎల్‌పిఒ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

➡️