ప్రజాశక్తి-కడప అర్బన్ : నగరంలో అన్న క్యాంటీన్, పారిశుద్ధ పనులను కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి శుక్రవారం మార్నింగ్ విసిట్లో భాగంగా పరిశీలించారు. రాజీవ్ మార్గ్ రోడ్, గాంధీ ప్లాజా, బిఎస్ తాండా, రైతు బజార్ ప్రాంతాలను ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో కలిసి పరిశీలించారు. రాజీవ్ మార్క్ రోడ్డు వద్ద నుంచి గాంధీ ప్లాజా వెళ్ళు మార్గం రోడ్డులో డ్రైనేజ్ మరమ్మతులు, నిర్మాణ పనుల గురించి అధికారులతో చర్చించారు. గాంధీ ప్లాజా వద్ద ఉన్న మిస్ట్ ఫౌంటెన్ ప్రతిరోజు సాయంత్రం వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం బలిజపల్లి, సుగాలి తాండ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ను పరిశీలిస్తూ డ్రైన్ సిల్క్ తీసివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేంజ్ కు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ ని ఆదేశించారు. నీరు సజావుగా వెళ్లేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రైన్ పైకప్పు స్లాబ్ వేయుటకు తగిన ప్రణాళికలను తీసుకోవాలని సూపర్ డేటింగ్ ఇంజినీర్ చెన్నకేశవరెడ్డి కి సూచించారు. అనంతరం ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ ప్రతిరోజు డ్రైనేజ్ వలన దుర్వాసన, వర్షపు సమయం లో నీరు రోడ్డుపైకి వస్తున్నాయని తెలిపారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగా అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ మళ్లింపు చర్యలు కొరకు తీసుకోవాల్సిన ప్రణాళికలను టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో చర్చించారు. ప్రతిరోజు ఇంటింటి చెత్త స్వీకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతం లో డెస్ట్ బిన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా శానిటేషన్ విభాగ అధికారులకు ఆదేశించారు. రైతు బజార్ పరిసరాల పరిశీలించి ప్రతిరోజు జన సంచారం ఉండే ప్రాంతం కావున ఉదయాన్నే శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగా అధికారులకు ఆదేశించారు. అక్కడ ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచించారు. నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఇ చెన్నకేశవరెడ్డి, సిటీ ప్లానర్ రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం, ఇఇ ధనలక్ష్మి , డిప్యూటీ ఇఇ వేణుగోపాల్, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.