ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ కోసం భూములు పరిశీలించారు. సోమరాజుపల్లిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి హైదరాబాద్ వరకు పెట్రోల్ పైప్‌లైన్ ఏర్పాటులో భాగంగా ఫిల్లింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ఇందుకు గాను సర్వే నెం. 470/3లో య.0.61సెంట్ల స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఆ భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఒంగోలు ఆర్డీవో సుబ్బారావు, తహశీల్దార్ టి.రవి, ఆర్‌ఐ ప్రవీణ్, విఆర్‌వో వెంకటాద్రి, సర్వేయర్లు ఉన్నారు.
