ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ప్రతి వీధిలో రాత్రి వేళల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మండలం లోని కడియపులంక గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ తెలిపారు. కడియపులంక శివారు వెంకాయమ్మ పేట మెయిన్ రోడ్ లో సుమారు రూ.5 లక్షల పంచాయితీ నిధులతో విద్యుత్ స్తంభాలను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో గ్రామ వీధులు లైట్లు లేక అందకారంలో ఉన్నాయని ఆ ప్రాంతవాసులు సర్పంచ్ రాంజీ దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. ప్రతి స్తంభానికి ఎల్‌ఈడి లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.