నరసరావుపేటలో మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, మంగళగిరి : భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లయిన సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హతలేదని, అనుచిత వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అమిత్‌షా పర్యటనను నిరసిస్తూ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వామపక్షాలు ఆదివారం ప్రదర్శనలు చేశాయి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట సిపిఎం నిరసనలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా పదవులు పొందిన అమిత్‌షా అదే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయగా అతనికి రాష్ట్రంలోని పాలక పక్షాలు రాచమర్యాదలు చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్‌ను అవమానించడం అంటే దేశద్రోహమేనని, బిజెపి వారి అసలు స్వరూపం ఇదేనని విమర్శించారు. రాజ్యాంగాన్నే మార్చేయాలనే ఆలోచనలో బిజెపి ఉందన్నారు. మంత్రి అమిత్ షా ను పార్లమెంటుకు అనర్హుడిగా ప్రకటించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, నాయకులు ఎస్.ఆంజనేయరాజు, సిలార్ మసూద్, డి.సుభాష్ చంద్రబోస్, జి.బాలకృష్ణ, కె.నాగేశ్వరరావు, పిడిఎం నాయకులు ఎన్.రామారావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా నాయకులు కె.ఏడుకొండలు పాల్గొన్నారు.మంగళగిరి అంబేద్కర్ సెంటర్‌లో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వానికి అంబేద్కర్ పట్ల, భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, జిల్లా నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య, పట్టణ నాయకులు ఎం.బాలాజీ, వై.కమలాకర్, కె.శ్రీనివాసరావు, ఎం.చలపతిరావు, ఎస్.గణేష్, ఎం.నాగేశ్వరావు, ఎం.చంద్రారావు, టి.శ్రీనివాసరావు, వి.శ్రీను, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, పి.నాగేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, కె.ఈశ్వరరావు, కె.నరసింహారావు, వై.వెంకటేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్) నాయకులు కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజే స్తున్న వామపక్షాలు
