సర్వమత సామరస్యమే భారతీయ జీవన విధానం : సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సర్వమత సామరస్యా మే భారతీయ జీవన విధానం అని తరతరాలుగా అలాగే జీవిస్తున్నారని, జాతీయోద్యమంలో కూడా హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు ఐక్యంగా బ్రిటీష్‌ పాలకుల పై తిరుగుబాటు చేసిన చరిత్ర ఉన్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అన్నారు. అలాంటి భారతదేశంలో మత ప్రాతిపదికన విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని. అందులో భాగంగానే హైందవ శంఖారావం సభ విజయవాడ కేంద్రంగా విహెచ్పి జరిపి అబద్ధాలు అర్ధ సత్యాలు ప్రచారం చేసిందని ఆయన అన్నారు. ఎందరు ఎన్ని కుట్రలు చేసినా మతసామరస్యాన్ని, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడుకుంటామని , మసీదులు పైదాడులు, దేవాలయాలు కబ్జాకు ప్రయత్నిస్తున్న మతోన్మాదులు ప్రయత్నాలను త్రిప్పి కొట్టేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించి కోవడం కోసం తుదికంటా ప్రజలు ఐక్యంగా పోరాడాలని , లౌకిక శక్తులు ఈ కృషిలో భాగం కావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులురెడ్డి శంకరరావు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం 29 వ వార్డ్‌ ఎస్వీయన్‌ నగర్‌, రామకఅష్ణా నగర్లో ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ … మతము లన్నియు మాసిపోవును , ధరలు, నిరుద్యోగం పెరిగిపోతుంటే మత సామరస్యానికి గండికొట్టి మతోన్మాద చర్యలుకు పూనుకుంటున్నా ఉన్మాద శక్తులనుంది దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలే కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మతోన్మాదుల నుండి దేశ రక్షణకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత, మతసామరస్యం ,రాజ్యాంగ పరిరక్షణకై దేశ వ్యాప్తంగా సీపీఎం వారం రోజులు పాటు జనవరి 2 నుండీ 10 వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో సీపీఎం స్థానిక నాయకులు ఎం. శాంత మూర్తి, ఎం. జగదాంబ , కె. రమణమ్మ, లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️