ఒంగోలు (ప్రకాశం) : కిమ్స్ హాస్పిటల్ లో అరుదైన వ్యాధికి అంతర్జాతీయ చికిత్స చేసి వైద్యులు విజయం సాధించారు. శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. 37 సంవత్సరాల భవన కార్మికుడు గత 3 సంవత్సరాలు గా అన్నం, నీరు మింగటానికి త్రీవ్రమైన ఇబ్బంది పడుతూ కిమ్స్ హాస్పిటల్స్ ఒంగోలు వద్ద జీర్ణకోశ కాలేయ విభాగం లో నిష్ణాతులైన డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి ని సంప్రదించడం జరిగింది. డాక్టర్ జగదీశ్వరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అన్న ప్రేగు లో కండరం బిగుతుగా మారడం వలన ఈ సమస్య వచ్చింది అని నిర్ధారించారు. దీనికి కోత, కుట్టు లేకుండా ఎండో స్కోపి (పర్ ఓరల్ ఎండోస్కోపిక్ మైటోమీ) ద్వారా బిగుతుగా ఉన్న కండరాన్ని సడలించారు. అతి తక్కువ ఖర్చు లో అంతర్జాతీయ ప్రమాణాలతో, తక్కువ సమయం లో రోగి కి దీర్ఘ కాలికంగా ఉన్న వ్యాధిని నయం చేశామని తెలిపారు. ఈ సందర్బంగా ఈడి గిరి నాయుడు మాట్లాడుతూ … ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కిమ్స్ హాస్పిటల్స్, ఒంగోలు లోనే అతి తక్కువ ధర లలో లభ్యం అవుతున్నాయన్నారు. వీటితోపాటు జీర్ణకోశ, కాలేయ క్లోమగ్రంధి లో గల వ్యాధులకు ఉత్తమమైన చికిత్స అన్ని వేళల్లో అందిస్తామని తెలియజేశారు. కిమ్స్ హాస్పిటల్ సీ.ఓ ఓ. కె . అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ టి.శ్రీహరి రెడ్డి ఈ చికిత్స ను విజయవంతం చేసిన వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.