ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు మొదిలి మృతి

Jan 16,2025 20:49

 ప్రజాశక్తి-విజయనగరం కోట : ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు మొదిలి శ్రీనివాసరావు (65) కన్నుమూశారు. గురువారం ఉదయం విశాఖలోని తన నివాసంలో నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందారు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు భౌతికకాయాన్ని విజయనగరంలోని స్వగృహానికి తరలించారు. పెద్ద ఎత్తున కార్మికులు, అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు మొదిలి శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనకు భార్య కమలావతి, ఇద్దరు కుమార్తెలు ఇందిరా సంయుక్త, నాగదుర్గ నివేదిత, కుమారుడు కౌశిక్‌ ఉన్నారు. ఈయన 1983 ఎన్నికలలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున అశోక్‌ గజపతిరాజుపై పోటీ చేసి ఓడిపోయారు.

➡️