ఇంటూరి అభిమానుల పాదయాత్ర

Jun 11,2024 19:52
ఇంటూరి అభిమానుల పాదయాత్ర

తిరుమలకి పాదయాత్ర చేస్తున్న ఇంటూరి అభిమానులు
ఇంటూరి అభిమానుల పాదయాత్ర
ప్రజాశక్తి-కందుకూరు ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి సిఎంగా చంద్రబాబునాయుడు సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నడం, ఎంఎల్‌ఎగా ఇంటూరి నాగేశ్వరావు 20 ఏళ్ల తర్వాత కందుకూరులో టిడిపి జెండా ఎగురవేయడాన్ని పురస్కరించుకుని అభిమానులు మొక్కు తీర్చుకునేందుకు కందుకూరు అంకమ్మ తల్లి ఆలయం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నాలుగో రోజు కోవూరు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరింది. ఈ పాదయాత్రలో అబ్బూరి వేణు, అబ్బూరి చందు, మధిర బ్రహ్మరూప్‌, పి పవన్‌, మద్దెల సాయి, వేములూరి సాయి, వేములూరి బ్రహ్మం, వేంకట్‌, రమణయ్య, సంపత్‌, శ్రీను, ప్రకాష్‌ పాల్గొన్నారు.

➡️