‘ఇంటూరి’ విజయం చారిత్రాత్మకం

Jun 10,2024 20:23
'ఇంటూరి' విజయం చారిత్రాత్మకం

ఇంటూరిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆరీఫుద్దీన్‌.
‘ఇంటూరి’ విజయం చారిత్రాత్మకం
ప్రజాశక్తి – కందుకూరు గతంలో ఎన్నడూ లేని విధంగా కందుకూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణంలోనే 7,400 మెజారిటీ సాధించడం చారిత్రాత్మక విజయం అని మైనార్టీ నాయకులు సయ్యద్‌ అరిఫుద్దీన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం బడేవారిపాలెం లోని స్వగహంలో ఆరిఫుద్దీన్‌ ఇంటూరి నాగేశ్వరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు ఐదుగురు ఆంధ్రులకు క్యాబినెట్‌ లో స్థానం కల్పిం చడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వీరి పాలనలో ప్రజలకు మంచి జరగాలని కాంక్షిస్తూ జిల్లాలోని ప్రఖ్యాత కసుమూరు దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన, శాంతియుతమైన పరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆరిఫుద్దీన్‌ ఆకాంక్షించారు.

➡️