దేవీ నవరాత్రి ఉత్సవాలకు సిఎం చంద్రబాబు, లోకేష్‌కు ఆహ్వానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అక్టోబరు 3 నుంచి జరగనున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు (దసరా) సిఎం చంద్రబాబు, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ ఆహ్వానించింది. సిఎంను సోమవారం కలిసి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందించిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనరు సత్యనారాయణ, కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ఇఒలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు.

➡️