ప్లేమింగో ఫెస్టివల్‌ కు సిఎం చంద్రబాబుకు ఆహ్వానం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (చిత్తూరు) : సూళ్లూరుపేటలో ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ కు ముఖ్య అతిధిగా రావాలని కోరుతూ … రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ ఆహ్వాన పత్రిక అందజేశారు. నారావారిపల్లె లోని సిఎం చంద్రబాబు నివాసంలో ఆయనను ఎమ్మెల్యే విజయశ్రీ మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కలెక్టర్‌ డా.ఎస్‌.వెంకటేశ్వర్‌, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం,చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పలువురు నాయకులు ఉన్నారు.

➡️