ప్రజాశక్తి- గాజువాక :ఉపాధ్యాయులకు తక్షణమే డిఎ చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం గాజువాక సిఐటియు కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 29శాతం ఇంటిరియం రిలీఫ్ (ఐఆర్) ఇవ్వాలని కోరారు. ప్రధాన కార్యదర్శి టిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా విద్యార్థుల నమోదు పెంచేందుకు యుటిఎఫ్ నేతలు, కార్యకర్తలు ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు టి. అప్పారావు, మహ్మద్ రిజ్వాన్, ఎం. రవిబాబు, పెద గంట్యాడ ప్రధాన కార్యదర్శి సూరిబాబు, గాజువాక అధ్యక్షులు ఎస్‌వి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సబ్బారపు నూకరాజు, ఎన్. శ్రీనివాస్ రాజు, డి.నూకరాజు, ఎ. రవిబాబు, ఎస్.అపరంది, ఎ. విజయకుమారి, బి. సువర్ణలత, ఎం. అనితకుమారి, కె.మహిమరావు స్థానిక సిఐటియు నేతలు ఎం.రాంబాబు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఎస్‌వికె.పరశరాం పాల్గొన్నారు.
