అల్లరి మూకలపై ఉక్కుపాదం : ఐజి

May 16,2024 00:20

ప్రజాశక్తి – మాచర్ల : అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపనున్నట్లు గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. పట్టణంలో బుధవారం ఆయన పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయన్నారు. జరిగిన హింసలో ఎవరున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లా ఎస్‌పి బిందుమాధవ్‌ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా బందోబస్తును ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ తరువాత జరిగిన ప్రతి ఘటనపైనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆరెస్టుల ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. పల్నాడు జిల్లాలో 144వ సెక్షన్‌ నిరవధికంగా ఉంటుందని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.పోలీసు సిబ్బందిపై నిఘా?మాచర్లలో పనిచేస్తున్న పలువురు పోలీసు సిబ్బందిపై ఉన్నాతాధికారులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలసింది. మాచర్లలో పని చేస్తున్న సిబ్బంది కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. పోలింగ్‌కు ముంద, పోలింగ్‌ రోజున, పోలింగ్‌ తరువాత జరుగుతున్న పరిణమాలపై రాజకీయ పార్టీలకు పోలీసు కదలికలను చేరవేస్తున్నట్లు అనుమానించి ఏడుగురు సిబ్బంది కాల్‌డేటా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం

➡️