ప్రజాశక్తి-ఒంగోలు : దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గత నెల 28న నిర్వహించిన ఆన్‌లైన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణపత్రాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. కళ్యాణి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ ప్రోగ్రామింగ్ ఇన్‌సి సర్టిఫికేట్ కోర్సులో 36 మంది విద్యార్థులు పాల్గొనట్లు తెలిపారు. అందులో 33 మంది ఉత్తర్ణత సాధించారన్నారు. అపైథాన్ 3.4.3 సర్టిఫికెట్ కోర్సులో 23 మంది విద్యార్థులు పాల్గొనగా 20 మంది ఉత్తర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలను నేర్చుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. జవహర్ నాలెడ్జ్ కేంద్రం పర్యవేక్షకురాలిగా డాక్టర్ రాజ్యలక్ష్మి, ఫుల్ టైమ్ మెంటర్‌గా సురేష్ కుమార్ వ్యవహరించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ డి.కళ్యాణి అభినందించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.