ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జిల్లా నుంచి ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డుకు ఆలమూరు ఎంపిక కావడం అభినందనీయమని గుమ్మిలేరు సర్పంచ్ గుణ్ణం రాంబాబు వ్యాఖ్యానించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు బుధవారం ఆయన విచ్చేసి సర్పంచ్ నేలపూడి లావణ్య, కార్యదర్శి కె.మోక్షంజలిని పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డు పోటీలకు ఎంపిక కావడం గ్రామస్తుల అదఅష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అవార్డును దక్కించుకోవాలని ఆయన ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాతి కుమార్ రాజా, వి.విజరు, సిబ్బంది పాల్గొన్నారు.
