42 వార్డులో “ఇది మంచి ప్రభుత్వం”

Sep 24,2024 18:11 #Kurnool, #tdp party

ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : కర్నూల్ నగరంలోని 42 వార్డు బాబా బృందావన నగర్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు నగర అధ్యక్షులు డి నాగరాజు స్థానిక టిడిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు. వంద రోజులు పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఎన్నికైన వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్న మాట తప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. అంతకుముందు జిల్లా టిడిపి కార్యాలయం ఎదుట ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్లో టీటీడీ లడ్డు కల్తీకి గత ప్రభుత్వం పాల్పడిందని ఆరోపణంగా నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుర్వ పరమేష్, రమణమ్మ, డి. జేమ్స్, సత్రం రామక్రిష్ణుడు, గున్నా మార్క్, కొరకంచి రవికుమార్, చంద్రశేఖర్, పాల్రాజ్, స్వామిరెడ్డి, బేతం క్రిష్ణుడు, మోతిలాల్, విజయలక్ష్మీ, రామక్రిష్ణ, జనసేన పవన్, మొదలగు వారితోపాటు తెలుగుయువత కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️