మన పరిసరాలను గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

Oct 1,2024 15:23 #Tirupati

ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : మన పరిసరాలను, గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంయుక్తంగా పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అన్ని రంగాల వారిని, స్టేక్ హోల్డర్స్ ను భాగస్వామ్యులను చేసుకుంటూ స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోడవం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్చతా హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా రెండు వారాల ముందు నుండి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ప్రతి రోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నేడు తిరుపతి నియోజకవర్గం నందు వినాయక సాగర్ చుట్టూ తిరుపతి ఎం.ఎల్.ఏ, మున్సిపల్ కమీషనర్ వారితో కలిసి వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మునిసిపల్ కార్పోరేషన్ వారి సహకారంతో ఒక పారిశుధ్య డ్రైవ్ ను, అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో గడిచిన రెండు వారాలలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేశామని అందులో భాగంగా మనము ఈ పారిశుధ్య డ్రైవ్ చేపట్టి చాల సంవత్సరాల నుండి ఉన్నటువంటి చెత్త నిల్వలను తీసేయడం జరిగిందని, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని, చిన్న పిల్లలు, యువతలో స్వచ్ఛత మీద రకరకాల పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో గెలుపొందిన వారికి రేపు బుధవారం మున్సిపల్ కార్పోరేషన్ వారి ఆద్వర్యంలో కచ్చపి ఆడిటోరియం నందు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రూరల్ పరిధిలో డి.పి.ఓ గారి ఆధ్వర్యంలో పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారు నిర్వర్తిస్తున్న వృత్తి వల్ల వచ్చే జబ్బులు రాకుండా నివారించడానికి ఆరోగ్య పరీక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌ. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి మార్గదర్శనం మేరకు పారిశుధ్యం మీద అవగాహన మరియు చర్యలు తీసుకుని తిరుపతి జిల్లాలో సచ్చతా హి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెల్తామన్నారు.తిరుపతి ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 రోజులుగా తిరుపతి నియోజకవర్గ పరిధిలో కలెక్టర్, కమీషనర్, పబ్లిక్ హెల్త్, యువత అందరు పాల్గొని తిరుపతి ఆద్యాత్మిక నగరంలో లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనార్థం వచ్చి వెళ్తుంటారని ఇలాంటి జిల్లాలో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతగా అధికారులదే కాదు, మన అందరిదీ అని ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. ప్రశాంతమైన తిరుపతి నగరంలో కలుషిత రహితంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాన్ని గతంలో కూడా అమలుచేయడం జరిగిందని, నేడు మన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నగరపాలక సంస్థ వాకర్స్ అసోసియేషన్, ప్రజల సహకారంతో పరిశుభ్రమైన తిరుపతిగా ఉంచేందుకు స్వచ్చతాహీ సేవా కార్యక్రమాలను ప్రధాన మంత్రి ఆశయాలను కొనసాగిస్తూ, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత పై పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా ఈ రోజు మాస్ క్లీన్ నెస్ కార్యక్రమం వినాయక సాగర్ లో మరియు అన్ని భవన సముడాయలలో చేయడం జరుగుతుందని తెలిపారు. రేపు ఉదయం 10.30 గంటలకు కచ్చపి ఆడిటోరియం లో స్వచ్ భారత్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్స్, యూడిఎస్ వర్కర్స్ ని సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు వారాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాద్యత అని, ఇంటింటికి, షాప్ టు షాప్ చెత్త బండి ఆటోలకు చెత్త ఇవ్వాలని, డ్రైన్స్ లో చెత్త వెయ్యరాదని వర్షాలు వచ్చినప్పుడు డ్రైన్స్ బ్లాక్ అయ్యి మ్యాన్ హోల్స్ నుండి నీరు బయట వచ్చేస్తుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ అన్వేష్, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

➡️