ప్రజాశక్తి - విజయగనరం : నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు ఎమ్మెల్యే బేబినాయన వివరించారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించాలని, సువర్ణముఖి నది నుంచి బొబ్బిలి పట్టణానికి ప్రత్యేక పైపులైన్ పనులకు నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. డొంకినవలస రైల్వే స్టేషన్ సమీపంలో చెరువులకు నీరు వెళ్లకుండా రైల్వే మూడో లైన్ కాంట్రాక్టర్ మట్టి వేశారని, చెరువులకు నీరు వెళ్లేలా చూడాలని కోరారు. ఎంపీగా ఎన్నికైన మొదటిసారి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బొబ్బిలి రావడంతో ఎమ్మెల్యే బేబినాయన, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంచి ఫ్లోర్ లీడర్ గెంబ్ శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
