‘ఇంటూరి’ని కలిసిన ఐటిడిపి బృందం

Jun 9,2024 21:19
'ఇంటూరి'ని కలిసిన ఐటిడిపి బృందం

ఇంటూరిని కలిసిన ఐటిడిపి బృందం
‘ఇంటూరి’ని కలిసిన ఐటిడిపి బృందం
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గంంలో టిడిపి జెండా ఎగిరి దాదాపు రెండు దశాబ్ధాలు అయింది. పార్టీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఇన్‌ఛార్జి బాద్యతలు ఇంటూరి నాగేశ్వరరావు చేపట్టిన నాటి నుంచి కార్యకర్తలను, పార్టీలోని వివిధ అనుబంధ సంఘం నాయకులను, సీనియర్‌ నేతలను అందరిని కలుపుకొని ఏక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి కార్యకర్త సమస్య తన సమస్యగా తీసుకొని అక్కున చేర్చుకొని తద్వారా నియోజకవర్గంలో సైకిల్‌ ను పరుగెత్తిచ్చారు. సోషల్‌ మీడియా వేదిక ఐటీడీపీ ద్వారా ఇంటూరి నాగేశ్వరావు తెలుగుదేశం పార్టీ తరుపున చేసే ప్రతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఇంటూరి నాగేశ్వరరావును పార్టీ విజయంలో తమకు అప్పజెప్పిన బాధ్యతను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా ట్రెండ్‌ చేసినట్లు తెలిపారు. .ఆదివారం ఇంటూరిని ఐటిడిపి బృదం కలిసింది. దేశ విదేశాలలో దేశ నలుమూలల ఉన్న ప్రతి టిడిపి కార్యకర్తలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని తద్వారా మన రాష్ట్రంలో నారా చంద్రబాబునా యుడుని ముఖ్యమంత్రిగా, తనను కందుకూరు నియోజకవర్గ టిడిపి ఎంఎల్‌గా గెలిపించాలని పిలుపునిచ్చిన ఇంటూరి నాగేశ్వరావుకి ప్రజలు పట్టంకటారు. గత రెండు దశాబ్ధాలుగా కందుకూరు నియోజ కవర్గంలోటిడిపి జెండా ఎగరలేదు…2024 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో విజయ దుందుభి మోగించి కందుకూరు గడ్డ పై టిడిపి జెండాను రెపరెపలాడించి చరిత్ర సష్టించిన ఘనత ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు అని పేర్కొన్నారు. నియోజకవర్గ ఐ-టీడీపీ అధ్యక్షులు షేక్‌ మున్న, నియోజకవర్గ ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి ముళ్ళపాటి మహేష్‌, నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షులు రాజశేఖర్‌, రామకష్ణ, నియోజవర్గ ఐటిడిపి సెక్రటరీ మోదేపల్లి రమేష్‌, షేక్‌ షరీఫ్‌, కందుకూరు పట్టణ ఐటీడీపి కోఆర్డినేటర్‌ వలేటి వెంకటేశ్వర్లు, ఉలవపాడు మండల ఐటిడిపి అధ్యక్షులు మట్టేపు సురేంద్ర, వలేటివారిపాలెం మండల ఐ టిడిపి అధ్యక్షులు మేకల.అశోక్‌, గుడ్లూరు మండల ఐటీడీపీ అధ్యక్షులు దివాకర్‌ పాల్గొని విజయచిహ్నం గా ఇంటూరి నాగేశ్వరరావు గారికి చిత్రపటాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.

➡️