ముస్లింలకు అండగా జగన్‌ : వైసిపి

ప్రజాశక్తిజి-మదనపల్లె అర్బన్‌ ముస్లింల మనోభావాలను గుర్తించి వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతి రేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం శుభ పరిణామమని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్‌ అహమ్మద్‌ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు అమలును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముస్లింల కోసం మాజీ సిఎం జగన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. సమావేశంలో కౌన్సిలర్‌ బి.ఎ.ఖాజా, నాయకులు రఫిక్‌ అహ్మద్‌, సలీం పాల్గొన్నారు.

➡️