16న జనసేన విజయోత్సవ ర్యాలీ

Jun 10,2024 20:32
16న జనసేన విజయోత్సవ ర్యాలీ

మాట్లాడుతున్న జనసేన నాయకులు
16న జనసేన విజయోత్సవ ర్యాలీ
ప్రజాశక్తి-నెల్లూరుసార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడాన్ని పురస్కరించుకోని నగరంలో ఈ నెల 16వ తేదిన జనసేన పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్‌ ప్రకటించారు. జనసేన పార్టీ జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజరు కుమార్‌ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని ఆమని గార్డెన్స్‌ లో పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా నేత నూనె మల్లికార్జున యాదవ్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలక విషయాలు చర్చించారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించడం పట్ల నేతలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలంటే పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.16 జరిగే విజయోత్సవ ర్యాలీ విజయవంతానికి ప్రతి ఒక్కరు కషి చేయాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువసేన, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, డివిజన్‌ ఇన్‌ఛార్జీలు ఉన్నారు.

➡️