ప్రజాశక్తి-రాయచోటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమ స్యలను బాధ్యతగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద ర్భంగా జెసి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించా లన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందని చెప్పారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని, కాబట్టి అధికా రులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఎ దరఖా స్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని తెలిపారు. సమస్యను పట్టుకొని పరిష్కారం కోసం ఎంతో ప్రయాసతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, వారి సమస్యను సావధానంగా వినాలని చెప్పారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో, సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జిల్లా సంయుక్త కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్, టీ సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ మధుసూదనరావు, ఎస్‌డిసి రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
