24వ రోజుకు జిందాల్‌ సమ్మె

Jun 9,2024 21:26

ప్రజాశక్తి – కొత్తవలస : జిందాల్‌ కర్మాగారం వద్ద కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారం నాటికి 24వ రోజుకు చేరింది. జిందాల్‌ కర్మగారాన్ని యాజమాన్యం బెషరతుగా తెరిపించి కార్మికులందరికీ పని కల్పించాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా యాజమాన్యానికి చీమ కుట్టినటైనా లేదని కార్మికు ఆందోళన వ్యక్తం చేశారు. తమ బతుకులు చిన్నాభిన్నమైనప్పటికీ యాజమాన్యం చోద్యం చూస్తుందని ఆరోపించారు. జిందాల్‌ కార్మికులకు ఎటువంటి సమాచారమూ లేకుండా యాజమాన్యం కార్మికులను రోడ్డుపైకి నెట్టిందని, ముందస్తు సమాచారం లేకుండా కంపెనీకి లే ఆఫ్‌ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. యాజమాన్యం బేషరతుగా కంపెనీ తెరిచి, కార్మికులందరికీ పని కల్పించాలన్నారు. ఎస్‌కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆదివారం వంటావార్పుకు సహకరించారు. ఈ కార్యక్రమంలో అప్పన్న పాలెం సర్పంచ్‌ కోన దేవుడు, ఉత్తరాపల్లి సర్పంచ్‌ సింగంపల్లి గణేష్‌, సిఐటియు జిల్లా నాయకుడు గాడి అప్పారావు, జిందాల్‌ టిఎన్‌టియుసి నాయకులు పిల్ల అప్పలరాజు, సలాది భీమయ్య, వైఎస్‌ఆర్‌టి యుసి నాయకులు లగుడువామాలు, పెదిరెడ్ల ప్రసాద్‌, నమ్మి చినబాబు, బొట్ట రాము, బాలిబోయిన ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️