జీవో 35ను తక్షణమే రద్దు చేయాలి

Apr 11,2025 21:17

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : పంచాయితీ రాజ్‌ శాఖలో ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణ వల్ల పరిపాలన అధికారులకు తీరని అన్యాయం జరుగుతుందని నాన్‌ గెజిటెడ్‌ గవర్నమెంట్‌ అధికారుల సంఘం జిల్లా అసోసియేట్‌ అధ్యక్షులు సురేష్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ సమావేశ భవనంలో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఇటీవల పంచాయతీ రాజ్‌ శాఖలో ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పాలనా సంస్కరణలను ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఉద్యోగుల సంఘం స్వాగతి స్తుందన్నారు. అదే సమయంలో శుక్రవారం ప్రభుత్వము విడుదల చేసిన జిఒ35లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లో పనిచేస్తున్న పరిపాలన అధికారులకు ఎంపిడిఒ ప్రమోషన్‌ పదోన్నతి కోటాలో తీరని అన్యాయం జరిగిందని అన్నారు. గతంలో ఫీడర్‌ కేటగిరిని బట్టి ఎంపిడిఒ ఉద్యోగోన్నతిలో తమకు 34% కేటాయింపు జరిగిందన్నారు. అదే సందర్భంలో ఇఒపిఆర్‌డిలకు 33శాతం, నేరుగా ఎంపిడిఒల నియామకానికి 30శాతం, ఇతరులకు 3శాతం కేటాయింపులు జరిగియన్నారు. సంస్కరణలో భాగంగా ఎంపిడిఒలకు నేరుగా నియామక కోటాను రద్దు చేసినందున తమకు కేడర్‌ స్త్రెంగ్థ్‌ ప్రకారం వారి పదోన్నతిలో 50శాతం కేటాయించాల్సి ఉుండగా కేవలము 34శాతం మాత్రమే కేటాయింపు చేయడం దారుణమని అన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లో పని చేసున్న పరిపాలన అధికారులకు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు, రికార్డు అసిస్టెంట్లకు, ఆఫీస్‌ సబర్డినేట్లకు తీరని నష్టం జరుగుతుందని, ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సవరించి తమకు సహజ న్యాయ సూత్రం ప్రకారం రావాల్సిన పదోన్నతి కోటాను (50శాతం) కేటాయించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. సమా వేశంలోఎన్‌జిజిఒ సంఘం కార్యదర్శి ఎ.సురేష్‌, పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మురళీ, కార్యదర్శి వి రాంబాబు, ట్రెజరర్‌ పీఎం ఆర్‌ కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీరాములు, ఆర్గనైసింగ్‌ సెక్రటరీలు నాలి అర్జునరావు, బి.లక్ష్మణ్‌ కుమార్‌, ఏవోలు లు జివి రమణ మూర్తి, బివి. నాగ భూషణరావు పార్వతీపురం, కురుపాం యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️